ఏటీఎం సహాయం లేకుండా SBI ఆన్ లైన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యండి..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సహాయం లేకుండా ఆన్ లైన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొత్త సేవలని ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ సర్వీసును ఉపయోగించి మీరు ఎంతో ఈజీగా ఆన్ లైన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పైగా ఇది సులువైన పద్దతి కూడా. ఏటీఎం సహాయం లేకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి…? అనే విషయానికి వస్తే… అఫీషియల్ వెబ్ సైట్ నుండి మీరు సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎటిఎం కి వెళ్లకుండా SBI నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి…?

SBI డెబిట్ కార్డ్ ఉంటే వెరిఫికేషన్ కి దానిని ఉపయోగించవచ్చు. బ్యాంకు కూడా వెళ్లక్కర్లేదు. అదే మీ దగ్గర SBI ఎటిఎం కార్డు లేకపోతే SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఏటీఎం కార్డు వివరాలు అడిగినప్పుడు.. ఏటీఎం కార్డు లేదు అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఒక పేజీ అప్లికేషన్ వస్తుంది. మీరు దానిలో టెంపరరీగా లాగిన్ అవ్వొచ్చు. మీరు రిజిస్టర్ అయిన మొబైల్ కి ఎస్ఎంఎస్ వస్తుంది కూడా. ఈ అప్లికేషన్ ని మీరు ప్రింటవుట్ తీసుకుని మీ ఖాతా ఉన్న బ్రాంచిలో మీరు సబ్మిట్ చేయాలి.

SBI ఆన్ లైన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో ఎలా చేయాలంటే..?

ముందుగా మీరు onlinesbi.com ని ఓపెన్ చేసి, అక్కడ లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ ని తీసుకుని.. దానిని డౌన్ లోడ్ చేసి మీరు మీ ఖాతా ఉన్న బ్రాంచి లో సబ్మిట్ చేయాలి. ఇలా మీరు ఈ ప్రాసెస్ లో మీ ఏటీఎం కార్డ్ అవసరం లేదు.

ఈ స్టెప్స్ ని అనుసరించండి:

ముందుగా మీరు onlinesbi.com లో ఆన్లైన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ను తీసుకోండి.
ఆ తర్వాత మీ పేరుని బ్లాక్ లెటర్స్ తో రాయండి.
ఏ ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యారో.. ఆ నంబర్ మాత్రమే ఇవ్వండి.
ఈమెయిల్ ఐడి, డేట్ అఫ్ బర్త్ కూడా రాయండి.
SBI అకౌంట్ డీటెయిల్స్ రాసి, సంతకం చేసి, తేదీ రాయండి.
ఫైనల్ గా మీరు మీ ఖాతా ఉన్న బ్రాంచిలో ఇచ్చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news