పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్.. ఆవుల కొనుగోలు అక్రమాలపై ఏసీబీ ఆరా..!

-

ఆవుల కొనుగోలు వివరాలను సేకరించిన ఏసీబీ కేసు నమోదు చేస్తోంది. ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు మళ్లించారు. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమయ్యాయి.

మిగిలిన 4.5 కోట్లు బినామీ అకౌంట్స్ కి ముఠా సభ్యులు మళ్లించారు. రైతులు నిలదీయడంతో కోటిన్నర తిరిగి ఇచ్చారు ముఠా సభ్యులుతమకు ఇంకా మూడు కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ నుండి రావాలని ఏసీబీకి ఫిర్యాదు చేసారు పుంగనూరు ఆవుల రైతులు.

Read more RELATED
Recommended to you

Latest news