సోనీలో లేఆఫ్స్.. ప్లేస్టేషన్‌ యూనిట్‌లో 900 మందికి ఉద్వాసన

-

ప్రముఖ టెక్‌ దిగ్గజం సోనీ భారీగా లేఆఫ్స్కు సిద్ధమైంది. ఈ కంపెనీకి చెందిన ప్లేస్టేషన్‌ విభాగంలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 900 (8 శాతం)మందిని త్వరలో తొలగించాలని నిర్ణయించింది. మరోవైపు లండన్‌ ప్లేస్టేషన్‌ స్టూడియోను పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటించింది. దీని ఆధీనంలోని ఫైర్‌స్పిరిట్‌ స్టూడియోస్‌ సిబ్బందిలో కూడా కోత విధించే అవకాశం ఉందని సమాచారం. సోనీ ఇంటరాక్టీవ్‌ ఎంటర్‌టైన్మెంట్‌లోని వివిధ విభాగాల్లో కూడా లేఆఫ్‌లు కొనసాగుతాయని, తొలగించే సమయంలో ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది.

పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సోనీ పేర్కొంది. భవిష్యత్తు కోసం వ్యాపారాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని, గేమర్లు, డెవలపర్ల అంచనాలను అందుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. భవిష్యత్తు టెక్నాలజీలను గేమింగ్‌లోకి తీసుకెళ్లాలని, అందుకే ఈ విభాగం అత్యున్నత ఫలితాలు ఇవ్వడం కోసం ఒక అడుగు వెనక్కి వేశామని ఓ ప్రకటన విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news