తస్మాత్ జాగ్రత్త.. దుబాయ్ కేంద్రంగా ట్రేడింగ్ పేరుతో మోసాలు…!

-

ఈరోజుల్లో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడు ఎలా మోసాలు జరుగుతాయి అనేది ఊహించలేకపోతున్నారు. ఆన్లైన్ లో మోసాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ముఖ్యమైన సమాచారాన్ని అసలు ఇతరులతో పంచుకోకూడదు. లేదంటే అకౌంట్ ఖాళీనే. ఇప్పుడు దుబాయ్ కేంద్రంగా ట్రేడింగ్ పేరు తో భారీగా సైబర్ మోసాలు పెరిగి పోయాయి. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఖాతా ఖాళీ అయ్యి పోతుంది.

తాజాగా ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు ఇప్పిస్తామని ఒక మహిళ నుండి మూడు కోట్ల రూపాయలని సైబర్ చీటర్స్ కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా… గోవా కి చెందిన రోనక్ తర్మ అనే నకిలీ అకౌంట్స్ తో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి ని అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించారు పోలీసులు. దుబాయ్ కేంద్రంగా జరిగే మోసాల మీద పూర్తి విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news