BREAKING : ఏపీ అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ

-

BREAKING : ఏపీ అంగన్వాడీలకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఏపీ అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువస్తూ జీవో నెంబరు 2 జారీ చేసింఇఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు చేయటం నిషేధమని పేర్కోంటూ ఉత్తర్వులు ఇష్యూ చేసింది.

Govt issues orders to implement ESMA on AP Anganwadis

అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత విధించింది ఏపీ ప్రభుత్వం. అటు అంగన్వాడీ వర్కర్లకు గత నెల వేతనంగా రూ.8050ని మాత్రమే జమ చేసింది ఏపీ ప్రభుత్వం. గత కొద్ది రోజులుగా అంగన్వాడీలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం….పలు డిమాండ్ల పై సానుకూలంగా స్పందించింది. జీతాల పెంపు, గ్రాట్యుటీ పై పెట్టుబడుతూ సమ్మె కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news