టి20 ప్రపంచ కప్ లో భాగంగా, ఇవాళ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అడిలైడ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇక భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే ఈ మ్యాచ్ కు వర్షం గండం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ మ్యాచ్ ప్రారంభం కాకముందే భారీ వర్షం పడితే టీమిండియా విజేతకానుంది. వర్షం పడకపోతే యధావిధిగా మ్యాచ్ జరగనుంది. ఇది ఇలా ఉండగా, ఈరోజు సెమీస్ మ్యాచ్ జరగకుండా టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. రకరకాల వీడియోలు, మీమ్స్ తో హంగామా చేస్తున్నారు. వీటిలో కొన్ని తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అమిర్ ఖాన్ నటించిన లగాన్ మూవీ సీన్ పై చేసిన ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. మ్యాచ్ కు ముందు భారత డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Scenes from the Indian dressing room. 👀😂 pic.twitter.com/VUG6JcRB25
— Rajasthan Royals (@rajasthanroyals) November 10, 2022