స్కామ్ ల కోసమే స్కీమ్ లు అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దోపిడీ చేశారని.. వాళ్ల దోపిడీ కొనసాగించేందుకు వ్యవస్థలను నాశనం చేశారని తెలిపారు. వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. అమరావతి గొప్ప నగరంగా తయారు కాకుండా ఐదేళ్లు అడ్డుకున్నారని తెలిపారు. 2014లో మనకు లోటు కరెంట్ ఉండేది.. పలు విధానాలు తీసుకొచ్చి మిగులు కరెంట్ పరిస్థితికి తీసుకొచ్చాం.
రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అమరావతి రైతులు ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారు. 2019లో విజయం సాధిస్తే.. 2021లోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది అని తెలిపారు చంద్రబాబు. ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మేము ఊహించిన దాని కంటే గత ఐదేళ్లలో ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయేందుకు సిద్ధంగా లేనని చెప్పారు.