తెలంగాణలో 300 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ష్నైడర్ ఎలక్ట్రిక్

-

తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ లో దేశంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్‌ పరికరాల తయారీ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఫ్రెంచ్‌ దిగ్గజం ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ శంకుస్థాపన చేసింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. హైదరాబాద్‌ లో రూ.300 కోట్ల పెట్టుబడి పెడుతున్నందుకు కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్‌ ఈ సందర్భంగా కృతజ్ఙతలు తెలిపారు.

స్మార్ట్‌ మ్యాను ఫ్యాక్చరింగ్‌ కోసం.. ప్రభుత్వంతో కలిసి.. శిక్షణ ఇవ్వాలని.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రముఖ ఫ్రెంచ్‌ ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీని కోరారు. రూ.300 కోట్లతో హైదరాబాద్‌ సమీపంలోని జీఎంఆర్‌ ఇండస్ట్రీయల్‌ పార్కు వద్ద ఏర్పాటు కానున్న ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ కొత్త స్మార్ట్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి కేటీఆర్‌ హాజరై భూమి పూజ చేశారు. ఈ యూనిట్ ద్వారా 1000 మందికి ప్రత్యక్షంగా మరియు 3000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version