లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీ గా ఉంటున్న చిన్న పిల్లలను కచ్చితంగా గమనించాలి అని సూచిస్తున్నారు వైద్యులు. వారి మానసిక పరిస్థితి క్రూరంగా మారుతుంది అని అలాగే వారు ఆడవాళ్ళ విషయంలో దారుణంగా ఆలోచిస్తున్నారు అని, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని తల్లి తండ్రులకు సూచనలు చేస్తున్నారు. ఢిల్లీలో ముగ్గురు విద్యార్ధులు ఆడవాళ్ళ అంగాల గురించి మాట్లాడుకున్నారు.
గ్రూప్ చాట్ చేసి క్లాస్ రూమ్ లో అందమైన అమ్మాయిల గురించి వారి అవయవాల గురించి మాట్లాడారు. వారి మీద కేసులు నమోదు చేసారు పోలీసులు. కొంత మంది విద్యార్ధులు వాట్సాప్ లో బ్లూ ఫిలిం లింక్స్ పంపుకున్నారు. వారిని కూడా గుర్తించి తల్లి తండ్రులకు కౌన్సలింగ్ ఇచ్చారు. ముంబై లో ముగ్గురు చిన్నారులు ఆడవాళ్ళ వస్త్రాల గురించి వాటి తయారి సహా స్కిన్ షో దుస్తుల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తూ…
సదరు లింక్స్ ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలను సోషల్ మీడియా కు దూరంగా ఉంచకపోతే వారు కామందులు గా మారే అవకాశాలు ఉంటాయని దయచేసి జాగ్రత్తగా ఉండాలని స్వేచ్చ ఇవ్వొద్దు అని సూచిస్తున్నారు. వారు ఒంటరి గా ఉండకుండా చూడటం కూడా తల్లి తండ్రుల బాధ్యత అని చెప్తున్నారు. ఇక వారితో గొడవలు పడకుండా ఉండటమే మంచిది అని చెప్తున్నారు.