తెలంగాణలో స్కూళ్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారు

-

హైదరాబాదద్: తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 16 నుండి కొత్త విద్యా సంవత్సరం మొదలుకానుంది. దీంతో 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. గతేడాది లా విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా తగ్గు ముఖం పడితే వచ్చే నెలలో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై నెలాఖరు వరకు కరోనా తగ్గు ముఖం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తరగతులు నిర్వహించేందుకు స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ఇన్ని నాళ్లు స్కూళ్లు మూసివేశారు. అటు వేసవి సెలవులు కూడా ముగుస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు ఇంట వద్దనే ఉన్న విద్యార్థులు త్వరలో పుస్తకాలు చేత బట్టి స్కూళ్లకు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version