స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యుల్ పై దుష్ప్రచారం.. సైబర్ సెల్ కు ఫిర్యాదు !

-

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు ఈ నెలలో నిర్వహించేందుుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మేరకు కమిషన్ షెడ్యూల్‌ కూడా విడుదల చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నెల 9 నుంచి 11 వరకూ మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు, 21న పోలింగ్ ఉంటుందని, 24న కౌటింగ్‌ నిర్వహించబోతున్నట్లు నిమ్మగడ్డ పేరుతో ఉన్న సమాచారం వాట్సాప్ లో గట్టిగా ఫార్వార్డ్ అయింది. ఈ విషయం మీద స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.

ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేసినట్లు జరుగుతున్న ప్రచారం ఫేక్‌ అని ఎస్‌ఈసీ ప్రకటించింది. అయితే ఇందులో కుట్ర కోణం ఉందని పేర్కొన్న ఈసీ ఈ స్థానిక సంస్థలకు చెందిన ఎన్నికల షెడ్యుల్ పై సోషల్ మీడియా లో జరుగుతున్న తప్పుడు ప్రచారం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ తో పాటు సూర్యారావుపేట పీఎస్ సైబర్ పోలీస్ లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం నేపధ్యంలో సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీచేసిన సైబర్ పోలీసులు ఈ మెసేజ్ ఎక్కడ నుండి మొదట ఫార్వార్డ్ అయిందనే విషయాన్ని తెలసుకునే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news