ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరియు జాతీయ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ ఇప్పుడు కొద్దిగా తగ్గినట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. కేంద్రంలో బలమైన మెజార్టీతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బిజెపి అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీసుకున్న నిర్ణయాలకు వ్యక్తమవుతోంది.
Cab మరియు nrc ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి మహారాష్ట్ర మరియు చత్తీసుగఢ్ తాజాగా ఢిల్లీలో ఓడిపోవడంతో ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయింది అని ఇకనుండి కొద్దిగ తగ్గి పరిపాలించాలని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయినట్లు ఇందుకోసమే వైయస్ జగన్ ని ఢిల్లీకి పిలిపించి నట్లు జాతీయ మీడియాలో న్యూస్ బట్టబయలైంది. ఏపీ సీఎం గా పదవి దక్కించుకున్న జగన్ 8 నెలల్లోనే దేశంలోనే అత్యంత మంచి పరిపాలన అందిస్తున్న సీఎంగా పలు సర్వేల్లో బయటపడింది.
దీంతో దక్షిణాదిలోనూ మరియు జాతీయ స్థాయిలోనూ జగన్ గ్రాఫ్ రోజు రోజుకి పెరగటంతో బీజేపీ యే జగన్ తో కాళ్ళ బెరానికి వచ్చినట్టు కొన్ని వార్తా సంస్థలు అంటున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల మొండి గా వ్యవహరించిన బిజెపి తాజాగా ఇప్పటినుండి సాఫ్ట్ కార్నర్ ఆలోచనలో ఉన్నట్లు దానికి కారణం వరుసగా జరిగిన ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో ఓటమికి కారణమని ఓ జాతీయ మీడియా కథనం తెలియజేసింది. మరోపక్క ఈ పర్యటనలో వైయస్ జగన్ శాసనసభ రద్దు మరియు దిశ చట్టానికి సంబంధించి కేంద్ర పరంగా వస్తున్న అడ్డంకులను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లా బోతున్నట్లు సమాచారం.