మరొక్కసారి రష్మిక కు ఛాన్స్ ఇవ్వనున్న యువ డైరెక్టర్….??

-

ఛలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న, ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ అందుకుంది. వెంకీ కుడుములు దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఆ సినిమా హిట్ కొట్టడంతో పాటు రష్మిక అందం,  అభినయానికి ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత నానితో కలిసి దేవదాసులో నటించినప్పటికీ ఆ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. అనంతరం విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించిన గీత గోవిందం సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి రష్మిక కు ఎంతో పేరు తెచ్చింది.

ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి మరొక హిట్ అందుకున్న రష్మిక, ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరుగా మారిపోయింది. ఇక ప్రస్తుతం బన్నీ, సుకుమార్ ల కలయికలో తెరకెకెక్కుతున్న సినిమాతో పాటు నితిన్ సరసన భీష్మ లో నటిస్తున్న రష్మికను మరొక్కసారి తన సినిమాలో తీసుకోవాలని చూస్తున్నాడట సరిలేరు దర్శకుడు అనిల్ రావిపూడి.

 

అతి త్వరలో తాను ఎఫ్ 2 కు సీక్వెల్ గా తీయనున్న ఎఫ్ 3 లో ఒక హీరోయిన్ గా రష్మిక అయితే బాగుంటుందని భావించిన అనిల్, అతి త్వరలో ఆమెను కలిసి కథను వినిపించనున్నాడట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, రష్మిక టాలీవుడ్ లో మరోక ఛాన్స్ పట్టేసినట్లే….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version