BREAKING : బీజేపీకి తెలంగాణ పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇవాళ, రేపు బైంసాలో 144 సెక్షన్ అమలు చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో బైంసాలో భారీగా పోలీసుల మోహరించారు.
బైంసాలో ఐదో విడత పాదయాత్రకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. అయితే, బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వలేదు. అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే, ఇవాళ, రేపు బైంసాలో 144 సెక్షన్ అమలు చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.