బోయిగూడ అగ్ని ప్రమాదంలో షాకింగ్ నిజాలు… దర్యాప్తులో వెల్లడి

-

సికింద్రాబాద్ బోయిగూడ అగ్రి ప్రమాదంపై దర్యాప్తు వేగం చేశారు. ఫైర్ సెఫ్టీతో పాటు క్లూస్ టీంలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇటీవల బోయిగూడలో స్క్రాప్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చెలరేగడంతో 11 మంది కూలీలు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై అంతా దిగ్భాంతి వ్యక్తం చేశారు. అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోరి వచ్చాయి. ఇప్పటికే పలు కీలక ఆధారాలను ఫైర్ సేఫ్టీ, క్లూస్ టీం అధికారులు సేకరించారు. క్లూస్ టీం త్రీడి స్కానర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అంచానా వేస్తున్నారు. స్క్రాప్ గోడౌన్ లో ఎగిసి పడిన నిప్పు రవ్వల కారణంగా కరెంట్ బోర్డులకు మంటలు వ్యాపించాయి. సిలిండర్ల, ప్యూజులు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా అయింది. ఒక్కో ఫ్యూజులో అదనంగా మందం వైరు ఉన్నట్లు గుర్తించారు.గోదాంలో 10కి పైగా స్విచ్ బోర్డులు ఉన్నట్లు గుర్తించారు. కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ వైర్లపై నిప్పు రవ్వలు పడటంతో ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ ఇనుప మెట్ల వద్ద మొదటగా ప్రమాదం జరిగిందని తెలిసింది. ఇనుప మెట్లు ఉండటంతో కిందికి రాలేక 11 మంది సజీవ దహనం అయ్యారని దర్యాప్తులో తేలింది. గాఢ నిద్రలో ఉండటంలో దట్టమైన పొగ పీల్చడం వల్ల కార్మికులు స్ఫ్రుహ కోల్పోయారని దర్యాప్తులో తేలింది. భారీ పేలుళ్లతో సిమెంట్ రేకులు తునాతునకలైంది. గోదాం కింద భాగంతో పాటు పై అంతస్తులో కూడా సిలెండర్లు పేలుళ్లతో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version