నిన్న సీఎం కేసీఆర్ నివాసంలో నేడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో…! ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్తా చదవండి. కరోనా మహమ్మారి దూకుడు ఎక్కువయ్యింది..! ఎప్పుడు, ఎక్కడికి, ఎలా వెళుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎన్నో కఠిన చర్యలు చేపట్టే వారి పై కూడా ఈ మహమ్మారి ఎఫెక్ట్ చూపుతుంది, వారు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఏదో ఒక తావు చూసుకొని వారి దగ్గరకు వెళ్లిపోతుంది. తాజాగా సీఎం కేసీఆర్ అధికారిక నిలయం అయిన ప్రగతీ భవన్ లోని 5 మంది సిబ్బంధికి కరోనా సోకడం తెలిసిందే ఇక ఇదే నేపద్యంలో తాడేపల్లి లోని సీఎం జగన్ నిలయానికి కూడా ఈ మహమ్మారి వెళ్లిపోయింది.
జగన్ ఇంటి వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బంధికి దాదాపుగా 10 మందికి కరోనా సోకిపోయింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8 మంది సెక్యూరిటీ గార్డులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. మరో బెటాలియన్‌కు చెందిన ఇద్దరు గార్డులు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ నెల 2న సీఎం నివాసం వద్ద గార్డులకు కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే టెస్టుల ఫలితాలను ఈ రోజు వెల్లడించారు. ఈ పలితాల్లో పది మంది వైరస్ నిర్ధారణ అయింది. గతంలో కూడా సీఎం నివాసం వద్ద ఇద్దరికీ కరోనా సోకిన విషయం తెలిసిందే ఇక ఇదే తరహాలో ఇప్పుడు 10 కి కరోనా సోకడం ఏపీ లో కలకలం రేపుతుంది.