బీజేపీలో పురందేశ్వరికి గౌరవం లేదు : మంత్రి అప్పల రాజు

-

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఏపీ మంత్రి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మద్యం అమ్మకాలపై కొన్ని రోజులుగా పురందేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పలరాజు స్పందిస్తూ… పురుందేశ్వరి ప్రతి రోజు మద్యం బ్రాండ్లను టేస్ట్ చేస్తున్నారేమో అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను మద్యం తాగనని, తనకు మద్యం టేస్ట్ లపై అవగాహన లేదని చెప్పారు.

ఇప్పుడు ఉన్న మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలో వచ్చినవేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పురందేశ్వరికి కొంచెం గౌరంవం ఉండేదని, ఇప్పుడు ఆమె చంద్రముఖిగా మారారని అప్పలరాజు ఎద్దేవా చేశారు. బీజేపీలో కూడా ఇప్పుడు పురందేశ్వరికి గౌరవం లేదని అన్నారు. పురందేశ్వరి బీజేపీలో ఉండటం అవసరం లేదని… టీడీపీలో చేరితే సరిపోతుందని సెటైర్లు వేశారు. ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కో ఆపరేటివ్‌ డెయిరీలు దాదాపూ నిర్వీర్యమైపోయాయని మంత్రి అన్నారు. దీనికి కారణం నాటి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే అని ప్రతీ ఒక్కరికీ తెలుసని చెప్పారు. తెలుగుదేశం హయాంలో ఈ రాష్ట్రంలో కో ఆరేటివ్‌ డెయిరీలు అసలు ఉన్నాయో లేవో అనే పరిస్థితి ఉండేదని విమర్శించారు. గుంటూరు, కృష్ణా, విశాఖ మిల్క్‌ యూనియన్‌ల డెయిరీలన్నింటినీ 1996 వరకున్న కో ఆపరేటివ్‌ యాక్ట్‌ స్థానంలో మ్యాక్స్‌ యాక్ట్‌ పరిధిలోకి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version