ఉత్తరాంధ్ర, సీమ వాసుల కన్నెర్ర… మీడియా సాక్షిగా మీడియాకు వాయింపు!

-

ప్రస్తుతం ఒక వర్గం మీడియాలో స‌మ‌గ్ర‌త లోపిస్తోందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి! బాబు చెప్పినట్లుగా రాసే ఆ పత్రికలు అమరావతిని సమర్ధించడం తప్పులేకపోవచ్చు కానీ… ఉత్తరాంధ్ర – రాయలసీమ ప్రాంతాల ప్రజలు ఏదో తప్పుచేసినట్లుగా, వారు రాజధాని ప్రాంతాన్ని కలిగి ఉండటానికి అర్హులు కాదన్నట్లుగా కథనాలు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర -సీమ వాసులు ఆ మీడియాపై కన్నెర్ర చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

“అమరావతి రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు బృహత్తరమైన ప్రణాళిక రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు. అమరావతి నిర్మాణం కొనసాగితే ఆ ప్రాంతమే కాకుండా అటు విజయవాడ, ఇటు జిల్లాలోని అన్ని ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి సాధించేవి. అనతికాలంలోనే మేటి నగరంగా అమరావతి రూపాంతరం చెందేది” అంటూ ఒక పత్రిక కథనం రాసుకొచ్చింది. ఇది నిజంగా నిజమే అయితే… ఈ గణనీయమైన అభివృద్ధిలో తమ ప్రాంతానికి కూడా వాటా కావాలని మిగిలిన ప్రాంత ప్రజలు అడగడం తప్పా.. వారిని కూడా పాలిబాగస్తులను చేయ్యాలని జగన్ భావించడం నేరమా? వారికే తెలియాలి!!

“రాజ‌ధానికి ఆనుకుని ఉన్న‌ పెదపరిమి, మద్దూరు, హరిశ్చంద్రపురం, వడ్డమాను వంటి గ్రామాల్లో ఇన్నర్‌ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న చోట్లా భూములు కొన్నవారున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచీ వారంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు”… అని మరో “పెద్ద” పత్రిక పెద్ద కథనంలో రాసుకొచ్చింది. అంటే అక్క‌డ భూములు కొన్న వాళ్లు త‌ప్ప మిగిలిన ప్ర‌జానీకం నిశ్చింతంగా నిద్ర‌పోతున్నార‌నే క‌దా అర్థం. అక్క‌డ భూములు కొన్న కొందరికోసం ఇత‌ర ప్రాంతాల అభివృద్ధిని గాలికి వ‌దిలేయాల‌ని “ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఇన్ ఆంధ్రప్రదేశ్” చెప్పడం ఏమిటి?

సరిగ్గా ఆలోచిస్తే… మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంతో ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల మ‌నోగ‌తాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నాన్ని బాబు అనుకూల మీడియా ఏనాడు చేయలేదు! కేవలం 24గంటలూ అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల పేరుచెప్పీ అక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల బాదలు, భూములు కొన్న వారి బాదలు ప్రజలపై రుద్దుతున్నారే తప్ప… ఉత్తరాంధ్ర ప్రజలు ఏమన్నారు – సీమ ప్రజలు ఏమంటున్నారు… వారి ఆనందాలను ప్రచురించగలిగారా?

సరిగ్గా ఇదే ఆలోచన చేసిన ఉత్తరాంధ్ర – సీమ ప్రజలు… “మా ప్రాంతానికి వ్యతిరేకంగా వార్తలు ఎందుకు రాస్తున్నారు.. మాపై మీకున్న ప్రత్యేక కక్ష ఏమిటి.. మీ ప్రాంతంలో రాజధాని కావాలి అని అడగండి కానీ, మా ప్రాంతంలో వద్దు అని చెప్పడానికి మీరు ఎవరు?” అని నిలదీయబోతున్నారంట! ఆ వర్గం మీడియాను.. మీడియా ముందే కడగాలని, మీడియా ముఖంగానే ఖండించాలని ఆలోచనలు చేస్తున్నారంట! ఇలాగే ఊరుకుంటే… “అసలు ఆ ప్రాంతాల ప్రజలే రాజధానినిని కోరుకోవడం లేదు… అలాంటప్పుడు జగన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు” అని రాసినా రాస్తారని ఆందోళన చెందుతున్నారంట!!

Read more RELATED
Recommended to you

Exit mobile version