ప్రస్తుత సమయంలో భాజపాకు వ్యతిరేకత భారీగా పెరిగిందని.. భాజపా ఓటమి లక్ష్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో కృషి చేస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటన చేశారు. 5 రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో ఓట్లలో చీలిక లేకుండా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. అన్ని రంగాల్లో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ..ప్రధానితో సహా ..ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగకుండా భాజపా పన్నాగం పన్నుతోందని చెప్పారు. రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటాం.. ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఎన్నికల తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు.
పంజాబ్ లో ప్రధాని వెళ్లాల్సిన సమావేశంలో ప్రజలు రాలేదని….కానీ ప్రధాని పర్యటనలో సెక్యూరిటీ లాప్స్ ఉంటే సీరియస్ చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రాజకీయ వాతావరణం నెలకొందని సీతారాం ఏచూరి వెల్లడించారు. కాగా.. నిన్న సీతారాం ఏచూరి.. సీఎం కేసీఆర్ తో థర్డ్ ఫ్రంట్ పై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.