సీటీమార్ టైటిల్ సాంగ్: ఈల గట్టిగా వేసిన గోపీచంద్..

-

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్సే ప్రామాణికం. ఎంత పెద్ద హిట్ వచ్చినా వరుసగా హిట్స్ ఇస్తూ ఉంటేనే కెరీర్ నిలబడుతుంది. వరుస ఫ్లాపులతో కొట్టిమిట్టాడుతూ విజయం కోసం ఎదురుచూస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. గోపీచంద్ కూడా అందులో ఒకడు. గోపీచంద్ ని విజయం పలకరించి చాలా రోజులయ్యింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉన్నాడు. ఐతే తాజాగా తన కొత్త సినిమా సీటీమార్ తో విజయం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా విడుదలైన సీటీమార్ పాటే అందుకు నిదర్శనంగా తెలుస్తుంది. ఏ సినిమాకైనా పాజిటివిటీ చాలా ముఖ్యం. సీటీమార్ టైటిల్ సాంగ్ వింటుంటే ఆ పాజిటివిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా పాట ప్రారంభంలో గెలుపు సూరీడు చుట్టు తిరిగేటి పొద్దు తిరుగుడు పువ్వా, మా పాపికొండల నడుమ రెండు జళ్ళేసిన చందమామ నువ్వా, మలుపు మలుపులోనా గలగల పారేటి గోదారి నీ నవ్వా, నీ పిలుపు వింటే చాలు పచ్చాపచ్చాని చేలు ఆడెనే సిరుమువ్వా.. సీటీమార్ అంటూ సాగిన సాహిత్యం చాలా బాగుంది. మణిశర్మ అందించిన సంగీతం అద్భుతంగా కుదిరింది. తమన్నా హీరోయిన్ గా కనిపిస్తున్న సీటీమార్ సినిమాని సంపత్ నంది దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version