సీటీమార్: జ్వాలరెడ్డి పాట.. తెలంగాణ జానపదం..

-

ప్రస్తుతం జానపద పాటలు తెలుగు సినిమాల్లో మారు మోగుతున్నాయి. మొన్నటికి మొన్న సారంగ దరియా పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. తాజాగా మరో తెలంగాణ జానపదం ఫ్లేవర్ తో మరో పాట వచ్చింది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ సినిమా నుండి జ్వాలారెడ్డి అనే పాట రిలీజైంది. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారాబూంది లడ్డురో ఆడించే కబడ్డీరో అంటూ సాగే పాట ఆద్యంతం ఆసక్తిగా ఉంది. అచ్చమైన తెలంగాణ పదాలతో వచ్చిన ఈ జానపదం ప్రేక్షకులని బాగా ఆకర్షిస్తుంది.

పాటలో గోపీచంద్, తమన్నా మధ్య డాన్సులు చాలా బాగున్నాయి. పక్కా మాస్ సాంగ్ తో దర్శకుడు సంపత్ నంది మాస్ ప్రేక్షకులని లాక్కున్నాడనే చెప్పాలి. మణిశర్మ అందించిన సంగీతం అద్భుతంగా కుదిరింది. శంకర్ బాబు, మంగ్లీ స్వరాలు అందించగా కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చారు. ఈ పాట మరీ మాస్ నంబర్ గా గుర్తింపు పొందుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2వ తేదీన విడుదలకి సిద్ధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version