ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఆఫీస్ ఎదుట రేపు దేశ్యవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు బుధవారం ఈడీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అందుబాటులో లేనందున తెలంగాణలో రేపు నిరసనలు చేయాలని నిర్ణయించింది పార్టీ.అయితే, పీసీసీ చీఫ్ లేకపోయినా కాంగ్రెస్ పిలుపు మేరకు ధర్నా చేస్తానని సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు.దీంతో ఈడీ కార్యాలయం ముందు బైఠాయించి వీహెచ్ నిరసన తెలిపారు.
ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ భారీ ధర్నా
నేషనల్ హెరాల్డ్ అంశంపై నేడు దేశవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునచ్చిన కాంగ్రెస్
పీసీసీ చీఫ్ అందుబాటులో లేనందున తెలంగాణలో రేపు నిరసనలు చేయాలని నిర్ణయం
పీసీసీ చీఫ్ లేకపోయినా కాంగ్రెస్ పిలుపు మేరకు ధర్నా చేస్తానంటున్న సీనియర్ నేత వీహెచ్
ఈడీ… https://t.co/Ns44WPhyxw pic.twitter.com/L3Vf5Eq7Un
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2025