ప్రముఖ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మరికాసేపట్లో ఆయన భౌతికకాయాన్ని మగ్దూం భవన్‌కు తరలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడ విశాలాంధ్ర కార్యాలయానికి తరలిస్తారు.
అలాగే రాఘవాచారి మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.