బుల్లితెర పై ప్రసారమవుతున్న ఎన్నో కామెడీ ఎంటర్టైన్మెంట్ షోలలో జబర్దస్త్ కూడా ఒకటి. ఇందులో హైపర్ ఆది గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హైపర్ ఆది పై ప్రేక్షకులలో మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ.. ఈయన పంచ్ లపై ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరి కొంతమంది హైపర్ ఆది మాటలు వింటే అసహ్యం వేస్తోంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్టులలో ఒకరైన ఇమంది రామారావు, హైపర్ ఆది గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇమంది రామారావు మాట్లాడుతూ.. ఏ షో కి అయినా సరే రేటింగ్ ను బట్టి మార్కెటింగ్ ఉంటుంది. జబర్దస్త్ షోలో ఇచ్చే పేమెంట్స్ కూడా మంచి పేమెంట్స్ అంటూ ఆయన తెలిపారు. జబర్దస్త్ టీం లో ఒక్కో టీం కు 5 లక్షల రూపాయల పారితోషకం అందిందని ఆయన తెలిపారు. ఇకపోతే జబర్దస్త్ లోని ఎంతోమంది ఆర్టిస్టులకు ఈ షో ద్వారా లైఫ్ లభించింది అని కూడా కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే రష్మీ కూడా తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకుని మరీ మంచి పేరు తెచ్చుకుందని ఆయన వెల్లడించారు. ఇక జబర్దస్త్ వేదికను తక్కువగా చూస్తే ఇబ్బంది పడాల్సిందేనని కూడా తెలిపారు.
ప్రస్తుతం జబర్దస్త్ ని చూసి ఇతర కామెడీ ప్రోగ్రామ్స్ పెట్టిన అసలు సక్సెస్ కాలేదని ఆయన తెలిపారు. రోజా కి అవకాశం లేక ఇంద్రజ వచ్చిందని , జబర్దస్త్ షో కి జడ్జిగా కృష్ణ భగవాన్ కరెక్ట్ గా సూట్ అయ్యాడు అని కూడా తెలిపారు. ఇక హైపర్ ఆది గురించి మాట్లాడుతూ.. హైపర్ ఆది వేసే పంచులు చూస్తే అసహ్యం వేస్తుంది.. వెటకారం , వ్యంగ్యం అవతలివాళ్ళను కించపరిచేలా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. కామెడీ అనేది భల్లాలతో గుచ్చినట్లు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. అయితే జబర్దస్త్ డైరెక్టర్ లు ఈ విషయంలో జాగ్రత్త పడాలని.. లేకపోతే ఇబ్బంది పడతారని కూడా రామారావు వెల్లడించారు. ఇక వ్యక్తిగతంగా సుధీర్ కూడా చాలా మంచి మనిషి అని కూడా తెలిపారు.