ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్లు గల్లంతయ్యాయని..ఈవీఎంలు టాంపరింగ్ జరిగాయని ఆయన ఆరోపించారు. తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు.బుధవారం నాడు విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ….. పల్లా శ్రీనివాస్‌కి లక్ష మెజారిటీ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తన ఓట్లు కూడా పల్లాకు పడ్డాయని,ఈ అంశాన్ని కోర్టులో తేల్చుకుంటానని అన్నారు. దేశంలో హేమాహేమీ నాయకులకంటే భరత్‌కు అంత భారీ మెజారిటీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
బీజేపీ చిత్తుగా ఓడి 240 సీట్లు గెలుచుకుందని ,నాడు 151 సీట్లలో గెలిపించిన ప్రజలే.. నేడు 110 అయినా ఇస్తారన్న ధీమాతోనే జగన్ లండన్ వెళ్లాడని.. కానీ, 10 సీట్లకు పరిమితం అయ్యాడని అన్నారు .తాను గెలిస్తే నోరు విప్పలేనని.. అందుకే దేవుడు ఇలా నిర్ణయించాడని నమ్ముతున్నానని,చంద్రబాబును ప్రధాని చేసే బాధ్యత తనది పాల్ అన్నారు .చంద్రబాబుకి చిత్త శుద్ది ఉంటే.. పవన్ కళ్యాణ్‌ని సీఎం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈవీఎంల ద్వారా కూటమి గెలిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారు? అని కేఏ పాల్ ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదని పాల్ ప్రశ్నించారు. ప్రజల కోసం ఏ పార్టీతోనైనా పని చేయడానికి తాను సిద్ధం అని తెలిపారు…