నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్న నాలుగు కేబినెట్ బెర్తులు ఇవేనా..?

-

ఎన్డీయే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. జూన్ 8 లేదా 9న ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.గతంలో కాకుండా ఈ సారి బీజేపీ, భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ పార్టీలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో 12 మంది ఎంపీలు ఉన్న జేడీయూ పార్టీ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రి పదవుల కోసం గట్టిగా డిమాండ్ చేయనున్నారు. దీంతో పాటు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.

జేడీయూ 3 క్యాబినెట్ మంత్రితో పాటు ఒక MOS(స్వతంత్ర హోదా) కోరుతోంది. కనీసం 4 కేబినెట్ బెర్తులు దక్కుతాయని ఆశిస్తు్నారు. రైల్వే, గ్రామీణాభివృద్ధి, జలవనరుల వంటి శాఖలపై పార్టీ ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెనకబడి ఉన్న బీహార్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ కేబినెట్ బెర్తులు ఉపయోగపడుతాయని జేడీయూ భావిస్తుంది

.

Read more RELATED
Recommended to you

Exit mobile version