జగిత్యాలలో కాంగ్రెస్ నేత హత్యపై… స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారని వివరించారు. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నా కూడా కఠినంగా శిక్షించాలని… డిమాండ్ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ హత్యను రాజకీయాలకు ఆపాదించడం కరెక్ట్ కాదని… ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చురకలు కూడా అందించారు. ఈ సంఘటనపై… చర్యలు తీసుకోవాలని ఎస్పీకి కూడా కోరడం జరిగిందని…. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా…. జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్ శివారులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్య కు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపినట్టు చెబుతున్నారు స్థానికులు. దింతో రోడ్ పై బైఠాయించారు జీవన్ రెడ్డి. అయితే ఆయనను శాంతిప జేయడానికి అడ్లూరి లక్ష్మణ్ రంగంలోకి దిగారు.