కేటీఆర్.. ఎలా తిట్టాలో రేవంత్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకో అంటూ మాజీ ఎమ్యెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అటూ విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్యెల్యే జగ్గారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై మాస్ పంచ్ లు వేశారు. నీ అయ్యలా నువ్వు ఢక్కా మొక్కి తినలేదని మండిపడ్డారు. నువ్వు బాయిలర్ కోడి లాంటి వాడివి అంటూ సెటైర్లు పేల్చారు.
కేటీఆర్ బచ్చాలా వ్యవహ రిస్తుండు అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.
బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆరే అయినా నడిపించింది మాత్రం కేటీఆరే అన్నారు. సీఎం ఏం మాట్లాడినా బావ బామ్మర్దులు వక్రీకరి స్తున్నారని ఫైర్ అయ్యారు. మీ కథలు అట్లున్నాయ్ కాబట్టే సీఎం రేవంత్ మిమ్మల్ని తిడుతున్నాడన్నారు మాజీ ఎమ్యెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సీఎం రేవంథ్ రెడ్డి తిట్లను కేటీఆర్ తట్టుకోలేరన్నారు.