ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జోగి రమేష్ టాపిక్ చాలా హాట్ హాట్ గా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇటీవలే జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ వర్సెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. వసంత వైసీపీలో ఉన్న సమయంలో జోగి మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే జోగి మితిమీరిన జోక్యంతో వైసీపీని వీడి టీడీపీలో చేరినట్టు అప్పట్లో ప్రకటించారు వసంత కృష్ణ ప్రసాద్.
తాజాగా జోగి పై వసంత కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్ట్ తో కుల రాజకీయాలు చేస్తున్నారు. సాటి గౌడ కులస్దుడికి ఉద్యోగం ఇప్పించడానికి రూ.7లక్షలు తీసుకున్న వ్యక్తి జోగి రమేష్ అన్నారు. గుణం లేని వాడు కులం గురించి మాట్లాడతాడు. నియోజకవర్గంలో 5 ఉద్యోగాలు ఇప్పించి రూ.35 లక్షలు వసూలు చేసిన వ్యక్తి జోగి రమేష్ అన్నారు. రూ. 7 లక్షలు వెనక్కి కట్టారు. మరో 28లక్షలు కూడా కట్టడానికి సిద్దంగా ఉండండి. ధర్మంగా పని చేస్తే ఏమీ కాదు.. అధర్మంగా ఉంటే చట్టం చూస్తూ ఊరుకోదు అన్నారు. తాను గెలిచిన తర్వాత జోగి ఇంటిపై దాడి చేస్తామని పార్టీ నాయకులు అడిగినా వద్దని చెప్పానని సంచలన వ్యాఖ్యలు చేశారు.