ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఉన్న నిందితుల్లో a2 కు ఉరిశిక్ష వేసిన నల్గొండ కోర్టు మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. దీంతో ప్రణయ్ కేసు… గురించి నిన్నటి నుంచి చర్చ జరుగుతోంది. అయితే ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులందరూ వచ్చి… ప్రణయ్ సమాధి వద్ద కన్నీరు మున్నీరు అయ్యారు. కానీ అక్కడికి అమృత మాత్రం రాలేదు.

దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ హత్య కేసులో తీర్పు పైన… అమృత స్పందించారు. రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అని ఆమె రాసుకొచ్చి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అమృత. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ప్రణయ్ ని 2018 లో సుపారి గ్యాంగ్ తో చంపించాడు అమృత తండ్రి మారుతీ రావు.