జగన్ ఆస్తుల కేసులో తెలంగాణ సీబీఐ కోర్టు సంచలన నిర్ణయం

-

మాజీ సీఎం జగన్ ఆస్తుల కేసులో తెలంగాణ సీబీఐ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఛార్జిషీట్లు, డిశ్చార్జి పిటిషన్లు దాఖలు అయిన సంగతి తెలిసిందే.అయితే వీటిపై మళ్లీ విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి డిశ్చార్జి పిటిషన్లపై విచారణ జరిపేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసుల్లో వైఎస్ జగన్ సహా 130 పిటిషన్లపై పది సంవత్సరాలుగా విచారణ కొనసాగుతోంది.

అయితే ఈ కేసును విచారిస్తున్న సీబీఐ కోర్టు గత జడ్జి కావడంతో విచారణ మళ్లీ మొదటికొచ్చింది. ఈ మేరకు శుక్రవారం నుంచి డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఈ కేసుల్లో గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండటంతో జగన్ విచారణకు హాజరుకాలేదు. కొన్ని మినహాయింపులతో విచారణ సాగింది. కానీ ఇప్పుడు వైఎస్ జగన్ అధికారాన్ని కోల్పోవడంతో సీబీఐ విచారణకు ప్రతి శుక్రవారం హాజరుకావాల్సి ఉంటుంది. సీబీఐ కూడా కోర్టును ఇదే కోరే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version