‘కల్కి’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది… సినిమా రన్ టైం ఎంత అంటే..?

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే…’కల్కి’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించగా.. మొత్తం 3గంటల 56 సెకన్లు రన్ టైమ్ ఉండనుంది. సినిమా మొత్తాన్ని పరిశీలించాక సెన్సార్ బోర్డు ప్రతిపాదన మేరకు 1.36 నిమిషాల సీన్స్లన్ను రీప్లేస్మెంట్ చేసినట్లు సర్టిఫికెట్లో ఉంది. ఈనెల 27న ‘కల్కి’ రిలీజ్ కానుండగా త్వరలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version