టీటీడీ ఈవో సంచలన నిర్ణయం.. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్

-

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వాడారని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఈ సమస్యపై అధికార,ప్రతిపక్షాలు విమర్శలు,ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి.ఇదే వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, విచారించిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. పలు ప్రశ్నలు సంధించిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది.అంతేకాకుండా సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక సిట్‌‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఇకపై లడ్డూ, అన్నప్రసాదం, ఇతర సేవల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.దీంతో టీటీడీ భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరణ ప్రారంభమైంది.సీఎం ఆదేశాలతో భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరణ కోసం టీటీడీ ఈవో స్వయంగా రంగంలోకి దిగారు.గ్యాలరీ‌లో భక్తుల వద్దకు వెళ్లిన ఈవో టీటీడీలో అందిస్తున్న వివిధ సేవల గురించి ప్రజలను ఫీడ్‌ బ్యాక్ అడిగి తెలుసుకున్నారు. దీనిని నిరంతరం కొనసాగిస్తామని ఈవో తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version