ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో వైసీపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలిందని తాజాగా ఒక వర్గం మీడియా గగ్గోలు పెట్టింది. అయితే ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై తాజాగా సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇందులో జనాల్లోకి వచ్చిన విషయాలేమిటి.. పూర్తి వాస్తవాలేమిటి అనేది ఇప్పుడు చూద్దాం!
హైకోర్టు ఆదేశాలతో అధికారులు కూడా విధులు నిర్వర్తించలేకపోతున్నారని, “మధ్యంతరంగా ఎస్‌ఈసీ”ని నియమించేలా గవర్నర్ కు సూచించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ విషయం ఆ మీడియా.. ప్రజలకు తెలిసేలా చెప్పకపోవడం విడ్డూరమనే చెప్పాలి. అయితే సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనానికి ఏపీ సర్కార్ తరఫు న్యాయవాదులు బలమైన మరో సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేశారు. అదే పార్క్ హయత్ (రహస్య) భేటీ!
తాజాగా పార్క్ హయ్యత్ లో జరిగిన వీడియోలపై ప్రస్తావిస్తూ… నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాజకీయ నేతల ప్రమేయం ఉందని.. ఆ దిశగా తాజాగా జరిగిన పార్క్ హయ్యత్ సమావేశం ప్రత్యక్ష ఉదాహరణ కోర్టు ముందుకు తీసుకొచ్చారు ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు. అందుకు స్పందించిన కోర్టు.. “ఈ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి… నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై విచారణ చేద్దాం” అని వెల్లడించింది! ఇది ఇక్కడ కీలకమైన విషయం!!
ఇది ఇప్పుడు నిమ్మగడ్డ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విషయం. దీన్ని ఒక వర్గం మీడియా కానీ… అధికార పార్టీదే అంటోన్న సాక్షి కానీ ఈ విషయాలను ప్రజలకు వెల్లడించకపోవడం శోచనీయం. దీన్ని బట్టి ఎంత థరవుగా సమస్య పట్ల మీడియా డైల్యూట్ ఓ పక్క, అసలేం పట్టించుకోకపోవడం మరోపక్క.. వెరసి నిజాలు తొక్కిపట్టడం అనేది మీడియా కల్పించిన స్వేచ్ఛకే భంగకరం! ఇది తెలుగు మీడియా ధీనావస్థ అని విశ్లేషకులు భావిస్తున్నారు! నిజాన్ని వెల్లడించాలనే ఉద్ధేశంతో సోషల్ మీడియా ద్వారా పలువురు తమ అభిప్రాయాలను, యదార్థాలను నిక్కచ్చిగా చెప్తుండటం ద్వారా అయినా కనీసం ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు!