ఆసియాలోనే అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్‌ను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పవర్ ప్లాంట్ మొత్తం 1590 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని వల్ల ప్రతి ఏడాది వాతావరణంలో కలిసే 15 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. అందువల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం 2022 వరకు 175 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ కెపాసిటీయే లక్ష్యంగా పనిచేస్తోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన తాజా పవర్ ప్లాంట్ నాణ్యమైన విద్యుత్‌ను అందివ్వనుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సౌర విద్యుత్ ఇప్పుడు అందరికీ అవసరమన్నారు. 21వ శతాబ్దంలో సౌర విద్యుత్‌కు మంచి డిమాండ్ ఉంటుందని అన్నారు. ఆ విద్యుత్ చాలా నాణ్యమైందని, సురక్షితమైందని, కచ్చితమైందని అన్నారు. వన్ వరల్డ్, వన్ సన్, వన్ గ్రిడ్ లక్ష్యంగా ప్రపంచం పనిచేయాలన్నారు.
Delhi: Prime Minister Narendra Modi dedicates to the nation the 750 MW Solar Project set up at Rewa, Madhya Pradesh, via video conferencing. pic.twitter.com/O7MCLH6Efb
— ANI (@ANI) July 10, 2020
రేవాలో ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ స్థానిక పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. అలాగే ఈ విద్యుత్‌తో ఢిల్లీ మెట్రో రైల్ సేవలు నడుస్తాయని తెలిపారు. ఇదే కాకుండా షాజాపూర్, నీముచ్, ఛతర్‌పూర్‌లలోనూ ఈ తరహా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.