స్టాక్ మార్కెట్ వరుస లాభాలకు బ్రేక్ ..!

-

నేడు స్టాక్ మార్కెట్ నష్టాల బాట పట్టింది. నాలుగు రోజుల వరుస లాభాలకు నేడు చెక్ పడినట్లయింది. నిజానికి స్టాక్ మార్కెట్ మొదలైనప్పటి నుండి కాస్త అటుఇటుగా కదులుతున్న సమయంలో ఇన్వెస్టర్లు చివరి గంటలో అమ్మకాలకు మొగ్గు చూపారు. దీనితో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 376 పాయింట్లు కోల్పోయి 36,329 వద్ద ముగియగా, అలాగే నిఫ్టీ కూడా 94 పాయింట్లు నష్టపోయి 10,706 వద్ద ముగిసింది.

stock_market

ఇక నేడు ఇంట్రాడేలో నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే… ఇండస్ లాండ్ బ్యాంక్, వేదాంత, జెఎస్డబ్ల్యు స్టీల్, హిందాల్కో, ఎస్బిఐ బ్యాంక్ అత్యధిక లాభాలు తీసుకున్న షేర్లుగా ఉండగా.. మరోవైపు జి ఎంటర్టైన్మెంట్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, మారుతి సుజుకి షేర్లు అత్యధిక నష్టాలు పొందిన లిస్ట్ లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version