ఇతను మనిషి కాదు మానవ మృగం..! మొత్తంగా అత్యాచారం హత్యలు కలిపి 20 కేసులు నమోదయ్యాయి అందులో 19 కేసుల్లో దోషిగా కోర్టు తీర్పునిచ్చింది. అందులో నాలుగు కేసుల్లో మరణ శిక్ష విధంచగా మిగితా 15 కేసుల్లో యావత్ జీవ కారాగార శిక్ష విధించింది. మిగిలి ఉన్న ఒక్క కేసుపై ఈ నెల 24 న కోర్టు తీర్పుని ఇవ్వనుంది. ఇతనే సైనేడ్ మోహన్..చూడటానికి అమాయకుడిలా ఉండే నిలువెత్తు కిరాతకుడు. నరరూప రాక్షసుడు.
గతంలో 2009లో మోహన్ కాసరగోడులో మహిళా హాస్టల్‌లో వంటమనిషిగా పని చేస్తున్న 25 ఏళ్లు యువతిని పరిచయం చేసుకున్నాడు.. మాటలు కలిపి మబ్యపెట్టి ఆ యువతిని ప్రేమలోకి లాగాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బెంగలూరు తీసుకెళ్ళాడు పెళ్లి చేసుకున్నాం, త్వరలో ఇంటికి వస్తామని యువతి కుటుంబసభ్యులను నమ్మించాడు. బెంగళూరులో ఒక లాడ్జిలో రూం తీసుకొని యువతిపై ఆత్యాచారం చేశాడు. జులై 15న గర్భ నిరోధక మాత్ర అంటూ మెజెస్టిక్ బస్టాండ్‌లో సైనైడ్ మాత్రను మింగించాడు. పబ్లిక్ టాయిలెట్ కి వెళ్ళిన ఆ యువతి తిరిగి బయటకు రాలేదు. అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది మెల్లిగా ఏమి తెలియానట్టు అక్కడనుండి జారుకున్నాడు. కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టిన పోలీసులకి నిందితుడు చిక్కాడు.. విచారణ చేస్తుండగా అలా ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మండి అమ్మాయిలను మోసం చేసి చంపినట్టుగా మోహన్ అంగీకరించాడు. విచారణ చేస్తున్న పోలీసులు కంగుతిన్నారు.. అప్పటినుండే ఇతనికి సైనేడ్ మోహన్ అనే పేరు వచ్చింది. మోహన్ చేతిలో బలైన బాధితులు వీరే