1600 మందితో సీర‌మ్ ఇనిస్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌..!

-

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్‌కు భార‌త్‌లో సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఫేజ్ 2, 3 క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ను నిర్వ‌హించ‌నున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ ట్ర‌య‌ల్స్‌లో భాగంగా ఫేజ్ 2 ద‌శ‌లో 1600 మంది వాలంటీర్లతో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు గాను డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఇప్ప‌టికే అనుమ‌తులు పొందింది.

serum institute of india starts clinical trials for covishield vaccine

కాగా దేశ వ్యాప్తంగా ఉన్న 17 కేంద్రాల్లో 1600 మంది వాలంటీర్ల‌కు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వ‌నున్నారు. భార‌త్‌లో ఈ వ్యాక్సిన్‌ను కోవిషీల్డ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక విశాఖ‌లోని ఆంధ్రా మెడిక‌ల్ కాలేజీ, మైసూర్‌లోని జేఎస్ఎస్ అకాడ‌మీ ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌, ముంబైలోని సెత్ జీఎస్ మెడిక‌ల్ కాలేజ్‌, కేఈఎం హాస్పిట‌ల్‌, పూణెలోని బీజే మెడిక‌ల్ కాలేజ్‌, జోధ్‌పూర్ ఎయిమ్స్‌, పాట్నాలోని రాజేంద్ర మెమోరియ‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, నాగ్‌పూర్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్ త‌దిత‌ర కేంద్రాల్లో ఈ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు.

1600 మంది వాలంటీర్ల‌లో 400 మందికి కోవిషీల్డ్‌ను ఇస్తారు. మిగిలిన 1200 మందికి 3:1 నిష్ప‌త్తిలో కోవిషీల్డ్ లేదా ప్లేసిబో ఇస్తారు. మొత్తం రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ను ఇస్తారు. మొద‌టి డోసును 1వ రోజు, రెండో డోసును 29వ రోజు ఇస్తారు. ఒక్క డోసుకు 0.5 ఎంఎల్ ఇంజెక్ష‌న్‌ను ఇస్తారు. అయితే ఈ ట్ర‌య‌ల్స్ ఎప్ప‌టి వ‌రకు పూర్త‌వుతాయ‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news