పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో తాము అణు యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. స్థానికంగా ఉన్న ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్మీ పాక్ ఆర్మీ కన్నా బలమైందని అన్నారు. అయినప్పటికీ తమ వద్ద ఉన్న చిన్నపాటి అణ్వాయుధాలతో పెను విధ్వంసాన్ని భారత్‌లో సృష్టించగలమని అన్నారు.
భారత ఆర్మీకి దీటుగా బదులివ్వడం కోసం తాము చిన్నపాటి అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. భారత్‌లోని అస్సాం లాంటి చిన్న రాష్ట్రాలను ధ్వంసం చేయడానికి తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు చాలని అన్నారు. అయితే ముస్లింలను మాత్రం రక్షిస్తామని అన్నారు.
Sheikh Rasheed and his discoveries. This time he's found a scientist who made a precision kafir bomb for India. pic.twitter.com/uozTBHPLM2
— Naila Inayat नायला इनायत (@nailainayat) August 20, 2020
కాగా షేక్ రషీద్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రజలు మండిపడుతున్నారు. పాక్ తన వక్రబుద్ధిని మరోమారు ప్రదర్శించిందని అన్నారు. పాక్‌కు బుద్ధి చెప్పే సత్తా భారత్ వద్ద ఉందని అంటున్నారు. అయితే ఆయన ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఓసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సెప్టెంబర్ 2019లో భారత్‌పై అణ్వాయుధాలను ప్రయోగిస్తామని అన్నారు. తరువాత ఇప్పుడు మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు మరోమారు వివాదాస్పదమవుతున్నాయి.