తెలంగాణలో పుణ్యక్షేత్రాల్లో ఒక్కటి అయిన యాదాద్రి ఆలయం పునర్ నిర్మాణం తర్వాత ఇటీవలె భక్తులకు అనుమతి వచ్చింది. తాజా గా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామీ ఆలయంలో నేటి నుంచి ఆర్జిత సేవలు పునః ప్రారంభం అవుతున్నాయి. యాదాద్రిలో నేటి నుంచి ప్రారంభం అవుతున్న అర్జిత సేవలను ఉపయోగించుకోవాలని ఆలయ ఈవో గీతా రెడ్డి కోరారు. అర్జిత సేవల్లో భాగంగా సోమ వారం నుంచి నిత్య కల్యాణం, బ్రహోత్సవం, వెండి మొక్కు జోడు, దర్బార్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో తెలిపారు.
అలాగే మంగళ వారం నుంచి సుదర్శన నారసింహ హోమం ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అర్జిత సేవలు చేసే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరి కోసం ప్రత్యేక మహా ప్రసాద కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. కాగ యాదాద్రి ఆలయం పునర్ నిర్మాణం తర్వాత భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీ పెరగడంతో ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది.