ఏపీ రైతులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీ వ్యాప్తంగా నీటి తీరువాను గ్రామ సచివాలయంలోనే చెల్లించే అవకాశం కల్పించింది సర్కార్. ఆయకట్టు రైతులకు ఇది ఊరట కలిగించే అంశం. ఇక పై నీటి తీరువాను సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ కు చెల్లించవచ్చు. గతంలో నీటు తీరువా చెల్లించేందుకు రైతులు కొంత ఇబ్బందది పడాల్సి వచ్చేది.
ఇకపై అలాంటి సమస్యలు ఉండవన్నమాట. ప్రభుత్వం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయకట్టు రైతుల వివరాలను ఏపీ సేవ పోర్టల్ లోఇప్పటికే నమోదు చేసింది. వాటి ఆధారంగా రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేసి.. అక్కడిక్కడే రసీదు ఇవ్వనుంది. ఈ నిర్ణయం రైతులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు నీటి తీరువా చెల్లించాలంటే మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. వీటి సరఫరా ఆధారంగా ఆయకట్టు రైతుల నుంచి ఇప్పటి వరకు వీఆర్వోలు, ఆర్ ఐలు ఈ నీటి తీరువాను వసూలు చేసేవారు.