అడవి క్రూర జంతువులు ఎంత డేంజర్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ క్రూర జంతువుల్లో సింహం, పులి లాంటివే ఎక్కువగా అందరికీ తెలుసు. కానీ చాలా దారుణంగా ఉండే హైనాల గురించి చాలా మందికి తెలియదనే చెప్పక తప్పదు. ఈ హైనాలు కూడా సేమ్ తోడేళ్లలానే ఉంటూ గుంపులు, గుంపులుగా ఇతర జంతువులను వేటాడి తింటుంటాయి గుహ . అయితే ఇవి మిగతా క్రూర జంతువుల్లాగా కాకుండా వేటాడిన జంతువును మొత్తం తినేస్తుంటాయి.
అయితే ఇప్పుడు హైనాలు గురించి ఎందుకు చెప్తున్నామంటే తాజాగా ఇవి ఎంత ప్రమాదకరమైనవో తెలియజేస్తూ సౌదీ అరేబియాలో పురావస్తు శాఖకు సైంటిస్టులు ఒకఫొటోను పంచుకున్నారు. ఇందులో దాదాపు ఏడు వేల సంవత్సరాల కిందటి హైనాలకు చెందిన ఓ గుహను వారు కనిపెట్టారు.
ఈ గుహలో ఏమున్నాయో చూసి ఆ సైంటిస్టులు మొత్తం షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ గుహ నిండా ఎముకలతో చాలా భయంకరంగా ఉంది. అయితే ఆ ఎముకల్లో దాదాపుగా 40 రకాల జంతువుల ఎముకలతో పాటు మనుషులవి కూడా ఉండడంతో వారు ఖంగు తిన్నారు. ఇందులో పెద్ద పెద్ద జంతువుల ఎముకలు ఉండటంతో అవి ఎంత ప్రమాదకరంగా వేటాడేవో తెలుస్తోంది. మరి ఆ ఫొటోను మీరు కూడా చూసేయండి.