తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను కొనసాగుతుంది. ఉత్తర వాయువ్య దిశగా గంటకు పది కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది అని వాతావరణ శాఖ చెప్పింది. తీరం వెంబడి ప్రస్తుతం 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎవరు బయటకు వెళ్లకూడదు అని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇది క్రమంగా బలపడి అతి తీవ్ర తుఫాను గా మారనుంది అని తెలిపారు.
ప్రస్తుతం ఇది పారాదీప్ కి దక్షిణ ఆగ్నేయంగా 320, బాలాసోర్ కి 420 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది అని ఈ సందర్భంగా తెలిపారు. ఈనెల 26వ తేదీన పారాదీప్ సాగర్ ఐలాండ్ కు మధ్యన బాలాసోర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అన్ని పోర్టుల్లో రెండో నెంబర్ హెచ్చరిక కొనసాగుతుంది అని వాతావరణ శాఖ పేర్కొంది.