నవోదయలో విద్యార్థినులకు లైంగిక వేధింపులు.. పరారీలో టీచర్లు 

-

నవోదయ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలోని విద్యార్థినీలపై పలువురు టీచర్లు  లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం.ఈ ఘటన కామారెడ్డి – నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో వెలుగుచూసింది. కొద్ది రోజుల నుంచి నలుగురు ఉపాధ్యాయులు విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ విద్యార్థినిలు తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది.
విషయం బయటకు రావడంతో వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయులను గోప్యంగా కర్ణాటకకు అధికారులు  ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలుస్తోంది.లైంగిక వేధింపుల ఘటనను బయటకు పొక్కకుండా  వైస్ ప్రిన్సిపల్ జాగ్రత్త పడ్డట్లు సమాచారం. నలుగురు ఉపాధ్యాయులతో పాటు వైస్ ప్రిన్సిపాల్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా.. ఉపాధ్యాయులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుండగా..వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version