సుప్రీంని గడువు కోరిన ట్రావెన్ కోర్ బోర్డ్

-

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల  మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో, గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల గురించి తెలిసిందే. యుక్త వయస్సు కలిగిన వారు ఆలయ ప్రవేశం చేయడానికి ప్రయత్నించడంతో ఆలయ పరిసర ప్రాంతాలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి  సందర్భంగా సుప్రీం తీర్పును అమలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును ట్రావెన్ కోర్ బోర్డు ఆశ్రయించింది.

ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన వరదల కారణంగా పంబ, నీలక్కల్ ప్రాంతాలు తీవ్రంగా  ధ్వంసమయ్యాయని…దీంతో సరైన సదుపాయాల్లేక భక్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సుప్రీంకు బోర్డు తెలిపింది. మహిళా భక్తులకు  సౌకర్యాల కల్పనకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త సమయం కావాలని బోర్డ్ విన్నవించింది. మరోపైపు మహిళా భక్తుల వారికి తగిన భద్రతను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకి సమర్పించిన అభ్యర్థనలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news