ప్రధాని నరేంద్ర మోడీ కాసేపటి క్రితమే విశాఖపట్నం చేరుకున్నారు. రెండు రోజుల రాష్ట్రాల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం తొలిరోజు విశాఖలో అడుగు పెట్టారు ప్రధాని. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు.
ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు ఈ మధ్యాహ్నమే విశాఖ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్నారు. ఇక ప్రధాని మోదీకి మంత్రులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో సుమారు రెండు లక్షల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ.
ఎయిర్ పోర్ట్ నుండి ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుంది. సిరిపురం సెంటర్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ఈ రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షో అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. ఈ సభకి దాదాపు మూడు లక్షల మంది ప్రజలు హాజరవుతారని సమాచారం. ఇక సభ అనంతరం విశాఖ ఎయిర్ పోర్ట్ కి బయలుదేరి.. అక్కడినుండి భువనేశ్వర్ కి పయనమవుతారు మోదీ.