శభాష్ తల్లీ.. అల్లు అర్హ రేంజ్ మారిపోయినట్టేనా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో.. ఇప్పుడు ఆయనతోపాటు ఆయన కూతురు అల్లు అర్హకి కూడా అంతే క్రేజ్ లభిస్తోంది. తన కూతురు అల్లు అర్హకు సంబంధించిన అల్లరి వీడియోలను, ఫోటోలను బన్నీతో పాటు ఆయన సతీమణి స్నేహ కూడా ఎప్పటికప్పుడు తమ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్నారు.మరొకవైపు వెండితెరపై చైల్డ్ ఆర్టిస్టుగా కూడా సందడి చేసేందుకు సిద్ధమైంది ఈ చిన్నారి.. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంతా హీరోయిన్ గా రాబోతున్న శాకుంతలం సినిమాలో భరతుడి పాత్రలో కనిపించనుంది అర్హ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో చివరిలో సింహం పై ఎంట్రీ ఇచ్చిన అర్హ విజువల్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

తమ అభిమాన హీరో ముద్దుల కూతురు వెండితెరపై కనిపించనుండడంతో అభిమానులు ఫుల్ ఖుషి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ చిన్నారి ఇటీవల తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం .. అల్లు అర్హకు ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్టులో అర్హ ఒకరోజు చేయబోతుందని సమాచారం. ఇప్పుడు మరొకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి కూతురు పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

మొత్తానికైతే వరుస సినిమాలను అందుకుంటూ ఇప్పుడే స్టార్ స్టేటస్ పొందుతోంది అల్లు అర్హ . ఈ విషయం తెలుసుకొని తన తండ్రి అల్లు అర్జున్ “శభాష్ తల్లి” అంటూ తెగ సంబరపడిపోతున్నారు. అలాగే బన్నీ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version