ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా షారుఖ్‌

-

ఫ్లాపులు వస్తే ఏ హీరోకైనా మార్కెట్ పడిపోతుంది. రెమ్యూనరేషన్‌లో కోతలు పడతాయి. కానీ షారుఖ్ ఖాన్‌కి మాత్రం పరాజయాల తర్వాత డిమాండ్‌ పెరిగిపోతోంది. ఈ హీరోకి ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్‌ చెయ్యని రేంజ్‌లో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు.

షారుఖ్ ఖాన్‌కి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తర్వాత సరైన హిట్‌లేదు. ఎనిమిదేళ్లుగా తడబడుతూనే ఉన్నాడు. ఇక ‘జీరో’ డిజాస్టర్‌ అయ్యాక మూడేళ్లపాటు సినిమాలకి దూరంగా ఉన్నాడు. కెమెరా ముందుకు కూడా రాలేదు. దీంతో షారుఖ్‌ కెరీర్‌ స్లంపులో పడిందని, మళ్లీ కోలుకోవడం కష్టమనే కామెంట్స్‌ కూడా వినిపించాయి. కానీ షారుఖ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరస్తూ, వంద కోట్ల రెమ్యూనరేషన్‌ అందుకుంటున్నాడు.

షారుఖ్‌ ఖాన్ ప్రస్తుతం యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌లో ‘పఠాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోందీ సినిమా. ఈ యాక్షన్‌ ఎంటర్టైనర్‌కే షారుఖ్‌ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇండియన్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్‌ పెయిడ్‌ ఆర్టిస్ట్‌గా చరిత్ర సృష్టిస్తున్నాడనే టాక్ వస్తోంది.

షారుఖ్‌ ఖాన్‌కి చాన్నాళ్లుగా సరైన హిట్‌ లేకపోయినా, ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ భారీ ఓపెనింగ్స్‌ వస్తూనే ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫేవరెట్‌ స్టార్‌గా కొనసాగుతూనే ఉన్నాడు. అందుకే షారుఖ్ ఖాన్‌కి 100 కోట్ల రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారట. మరి రెమ్యూనరేషన్‌కే 100 కోట్లు ఖర్చుపెడితే, సినిమాకి ఎంత ఖర్చు పెడుతున్నారనేది టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version