బిగ్ బాస్ 7: షకీలా సిగరెట్ల కోసం హౌస్ లో ఎంత ఖర్చు చేసిందో తెలుసా ?

-

ఒకప్పట్లో చక్రం తిప్పిన సెలబ్రిటీల్లో ఒకరు నటి షకీలా. అయితే ప్రస్తుతం ఈమె పరిస్థితి బాగోలేదని,ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మళ్ళీ బుల్లి తెర పైకి వచ్చారని వార్త. ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటిస్టెంట్ గా మనల్ని షకీలా గారు అలరించి నిన్న జరిగిన ఎలిమినేషన్ లో ఇంటి నుండి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. షో లో బిగ్ బాస్ ఇంటి సభ్యులు అంతా అమ్మ అమ్మ అంటూ షకీలా గారి వెంట తిరిగారు. అయితే బిగ్ బాస్ షో కి రావడం తనకి ఇష్టం లేనప్పటికీ ఆర్థిక సమస్యల వలనే ఈమె ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ షో ద్వారా మళ్ళీ ప్రేక్షకులను అలరించారు షకీలా. కాగా ఈమె హౌస్ లో ఉన్న ఈ రెండు వారాలు సిగరెట్ లు తాగుతూ ఉండేది. ఈమె ఒక్క రోజుకు రెండు డబ్బాల సిగరెట్ లు తాగేదని తెలుస్తోంది..

ఒక డబ్బాలో పది సిగరెట్ లు ఉండగా.. రోజుకు 20 సిగరెట్ లు ఈమె తాగినట్లు. షకీలా అలవాటు ప్రకారం ఎస్సి లైట్స్ బ్రాండ్ ను తాగుతుందట.. ఆ ప్రకారం ఈమె హౌస్ లో ఉన్న రోజులు కేవలం సిగరెట్ ల కోసమే 8 వేల రూపాయలు ఖర్చు చేసిందట.

Read more RELATED
Recommended to you

Latest news