ఇంట్లో ఆస్థమా పేషెంట్స్‌ ఉంటే.. ఫ్లేవర్ క్యాండిల్స్‌ వెలిగిస్తున్నారా..?

-

ఈ మధ్య చాలా మంది బెడ్‌రూమ్‌లో మంచి ఫ్లేవర్‌ ఉన్న క్యాండిల్స్‌ వెలిగిస్తున్నారు. వీటి వాసనకు మత్తుగా ఉండి.. త్వరగా నిద్రపోవచ్చు. అలాగే.. మైండ్‌ కూడా చాలా రీఫ్రష్‌ అయినట్లు ఉంటుంది. అయితే వీటిని వెలిగించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించు కోవటం మంచిది. ముఖ్యంగా ఇంట్లో ఆస్థమాతో బాధపడే వారుంటే ఈ క్యాండిల్స్‌ వెలిగించకపోవడమే మంచిదట.. ఎందుకంటే..

క్యాండిల్స్‌ వెలిగించినప్పుడు, వంట వండేటప్పుడు వెలువడే పొగలతో కలుషితమయ్యే గాలి మూలంగా ఆస్థమా బాధితుల్లో చిరాకు, వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతున్నట్టు ఆర్హస్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో తేలింది. రక్తంలో వాపు ప్రక్రియ ఆనవాళ్లతో పాటు డీఎన్‌ఏ దెబ్బతింటున్న సంకేతాలూ బయటపడటం గమనార్హం. సాధారణంగా స్టవ్‌ మీద వండుతున్నప్పుడు, క్యాండిల్స్‌ వెలిగించినప్పుడు అతి సూక్ష్మ రేణువులు, వాయువులు వెలువడతాయి. ఇవి ఇంట్లోనే తిరుగాడుతూ శ్వాస ద్వారా శరీరంలోకీ ప్రవేశిస్తాయట. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటున్నట్టు గత అధ్యయనాల్లో తేలింది

ఈ నేపథ్యంలో పరిశోధకులు స్వల్ప ఆస్థమా గల 18-25 ఏళ్ల వారిపై ఇటీవల అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా ఈ వయసు వారు ఫిట్‌గా ఉంటారు. పెద్ద వయసు వారితో పోలిస్తే ప్రతికూల ప్రభావాలను బాగా తట్టుకుంటారు. కానీ వంట వండుతున్నప్పుడు, క్యాండిల్స్‌ వెలిగించినప్పుడు ఇంట్లో గాలి ధారాళంగా ఆడకపోతే స్వల్ప ఆస్థమాతో బాధపడే యువత మీద ఈ పొగ విపరీతమైన ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి ఇంట్లో గాలి కలుషితం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. తలుపులు, కిటికీలు తెరచి ఉంచటం మంచిది. ఇది ఆస్థమా తగ్గటానికే కాదు.. గుండె, ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్ల ముప్పులు తగ్గటానికీ తోడ్పడుతుంది.

కాబట్టి ఇలాంటివి వాడేముందు.. అన్ని విషయాలు తెలుసుకోండి. చాలామంది మనం తినే వాటి ద్వారానే మన ఆరోగ్యం పాడవుతుంది అనుకుంటారు. కానీ కంటికి కనిపించకుండా పీల్చే గాలి ద్వారా కూడా ఆరోగ్యం ఘోరంగా దెబ్బతింటుంది. గాలి కాలుష్యం వల్ల ఆత్మహత్యల ఆలోచనలు వస్తాయని మీకు తెలుసా..? ఒక వ్యక్తి కంటిన్యూస్‌గా నాలుగు రోజులు చెడుగాలిని పీల్చే ప్రదేశంలో ఉంటే.. ఆటోమెటిక్‌గా ఆ వ్యక్తి ఆలోచనల్లో మార్పులు వస్తాయి, డిప్రషన్‌కు గురువుతాడు.. అది ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. చుట్టు మొక్కలను పెంచుకుంటే.. వాటి గాలిని పీల్చుకోవచ్చు. అది మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news